Its a beautiful life :)

on my life and times :)

Friday, July 24, 2009

ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి

ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి
ఎప్పుడూ ఒదులుకో వొద్దు రా ఓరిమి

విశ్రమించ వొద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం

ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి
ఎప్పుడూ ఒదులుకో వొద్దు రా ఓరిమి

నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న
గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా

నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న
గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా


సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న
చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి
రవిని మింగు అసుర సంధ్య
ఒక్క నాడు నిగ్గ లేదురా


గుటక పడని అగ్గి ఉండ
సాగరాలనీదుకుంటు
తూరుపింట తేలుతుందిరా

నిశావిలాసమెంతసేపురా !! ఉషోదయాన్ని ఎవ్వడాపురా?
రగులుతున్న గుండె కూడా అగ్ని గోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడగునా
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా?
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా?

ఆశ నీకు అస్త్రమౌను శ్వాశ నీకు శశ్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా !
నిరంతరం ప్రయత్నమున్న దా !! నిరాశకే నిరాశ పుట్టదా !!

ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గ లేక శవము పైనె గెలుపు చాటురా !!
ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గ లేక శవము పైనె గెలుపు చాటురా !!

ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి



--> By Mr Sitarama Sastry







0 Comments:

Post a Comment

<< Home