Never accept defeat.
First raw attempt at translation [ not set to any meter ]
Original by Mr Sitarama Sastry
ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి- Never accept defeat
ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి == Never accept defeatఎప్పుడూ ఒదులుకో వొద్దు రా ఓరిమి == Never lose patience-
విశ్రమించ వొద్దు ఏ క్షణం == Do not rest any second
విస్మరించ వద్దు నిర్ణయం == Do not forget the resolve
అప్పుడే నీ జయం నిశ్చయం == Only then is your victory assured.
ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి == Never accept defeat
ఎప్పుడూ ఒదులుకో వొద్దు రా ఓరిమి == Never lose patience
నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న == However big may the sky be,
గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా == its smaller than the flapping baby bird's wing
నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న
గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న == however great may the sea be,
చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా == its smaller than the fin of a swimming baby fish
పశ్చిమాన పొంచి ఉండి ==
రవిని మింగు అసుర సంధ్య == the demonic evening that gobbles the sun
ఒక్క నాడు నిగ్గ లేదురా == has never won a single day
గుటక పడని అగ్గి ఉండ == the un swallowable fire ball
సాగరాలనీదుకుంటు == swims across the oceans
తూరుపింట తేలుతుందిరా == and floats up in the East
నిశావిలాసమెంతసేపురా !! ఉషోదయాన్ని ఎవ్వడాపురా?
== How long is the dance of darkness !! Who can stop the dawn of brightness !!
రగులుతున్న గుండె కూడా అగ్ని గోళమంటిదేనురా
== a burning heart is like a fire ball too
ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడగునా
== is there a painless minute , birth or death , or every step of life.
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
== if you tire and stop, even a minute is not yours, life is a constant struggle
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా?
== youve got the body, life, blood and stenght, is there an army better than this?
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా?
ఆశ నీకు అస్త్రమౌను శ్వాశ నీకు శశ్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా !
== Optimisim is your weapon, breath is your instrument, the goal is your guide
నిరంతరం ప్రయత్నమున్న దా !! నిరాశకే నిరాశ పుట్టదా !!
== if there is a never ending effort, doesnt pessimism itslef be pessimistic?
ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గ లేక శవము పైనె గెలుపు చాటురా !!
== as long as you are alive, even death can;t win, it can only declare victory over a corpse.
ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గ లేక శవము పైనె గెలుపు చాటురా !!
ఎప్పుడూ ఒప్పుకో వొద్దు రా ఓటమి == Never accept defeat.
0 Comments:
Post a Comment
<< Home